Narayana comments: కేసీఆర్ వల్లే తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది

ABN , First Publish Date - 2022-09-08T19:39:20+05:30 IST

కేసీఆర్ తప్పుల వలనే తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు.

Narayana comments: కేసీఆర్ వల్లే తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది

హైదరాబాద్: కేసీఆర్ (CM KCR) తప్పుల వలనే తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) బలం పెరిగిందని సీపీఐ నేత నారాయణ (Narayana) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఎంఐఎం (MIM) బ్లాక్ మెయిల్ నుంచి సీఎం కేసీఆర్ (Telangana CM) బయటపడాలని సూచించారు. ఎంఐఎం భుజంపై తుపాకీ పెట్టి బీజేపీ కేసీఆర్‌ను కాల్చుతోందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మురుగున పడేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. 


సినిమా రంగమంటే నాగార్జున ఒక్కడేనా?...

చిరంజీవి(Chiranjeevi)కి.. నాగార్జున (Nagarjuna)కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం కోట్ల రూపాయల అడ్వటైజ్మెంట్లను చిరంజీవి వదులుకున్నారని తెలిపారు. డబ్బు కోసమే నాగార్జున బిగ్ బాస్ (Big Boss) షో చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘బిగ్ బాస్ షోపై నా కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నాను. బ్రోతల్ హౌస్‌లో మహిళలతో పాటు.. పురుషులు కూడా ఉంటారు. మహిళలను కించపరిచినట్లు నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నన్ను బ్లాక్ మెయిల్ చేయటం ఎవరి వల్ల కాదు. సినిమా రంగం, కళాకారులపై నాకు అపారమైన అగౌరం. సినిమా రంగమంటే నాగార్జున ఒక్కడేనా?’’ అంటూ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Read more