మేడారం జాతర హుండీల లెక్కింపు

ABN , First Publish Date - 2022-02-24T01:51:13+05:30 IST

అత్యంత వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల లెక్కింపును

మేడారం జాతర హుండీల లెక్కింపు

హన్మకొండ: అత్యంత వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల లెక్కింపును నిర్వహించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. ఇప్పటివరకు  రూ.1,34,60,000ల ఆదాయం వచ్చింది. ఈ డబ్బును అధికారులు బ్యాంక్‌లో జమ చేశారు. 


మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చారు. ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది. 

Read more