సింగరేణిలో అవినీతి పెరిగిపోయింది: ఈటల

ABN , First Publish Date - 2022-03-13T22:06:12+05:30 IST

సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

సింగరేణిలో అవినీతి పెరిగిపోయింది: ఈటల

హైదరాబాద్: సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ను ప్రైవేట్‌పరం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత బీజేపీపై ఉందన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.

Read more