కార్పొరేటర్‌ భర్త బూతు పురాణం

ABN , First Publish Date - 2022-03-16T15:59:47+05:30 IST

బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో ఓ కార్పొరేటర్‌ బూతు పురాణం షోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బోడుప్పల్‌ కార్పొరేషనల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి

కార్పొరేటర్‌ భర్త బూతు పురాణం

సోషల్‌ మీడియాలో ఆడియో వైరల్‌..

హైదరాబాద్/ఉప్పల్‌: బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో ఓ కార్పొరేటర్‌ బూతు పురాణం షోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బోడుప్పల్‌ కార్పొరేషనల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డికి మరికొందరు కార్పొ రేటర్లకు మధ్య అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఇటీవల సాధారణ పాలక మండలి సమావేశంలో బయట పడ్డాయి. ఈ తరుణంలోనే ఓ కార్పొ రేటర్‌ భర్త మున్సిపల్‌ ఉద్యోగికి ఫోన్‌ చేసి ఇంజనీరింగ్‌ అధికారు లను ఇష్టా రాజ్యంగా దూషించిన ఆడియోను సదరు ఇబ్బంది సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం చర్చానీయంశ మైంది. ఆయన చేసిన కాంట్రాక్టు బిల్లు చెల్లిం పులో ఎందుకు ఆలస్యం చేస్తున్నా రంటూ పరుశ పదజాలా న్ని వాడారు. నాకంటే వెనుక చేసిన పనుల కు బిల్లులు ఇస్తున్నారంటూ నానా బూతులు తిట్టారు. ఇదే ఆడియోలను స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టారు. కార్పొరేటర్‌ తీరును నిరసిస్తూ బుధవారం మున్సిపల్‌కార్యాలయం ముందు ఆందోళన చేస్తామంటూ మున్సిపల్‌ ఉద్యోగులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడం చర్చానీయంశమైంది.

Read more