ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-09-13T10:10:47+05:30 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్‌

మండలి సమావేశాలకు హాజరు.. సభ్యుల్లో కలవరం

నిజామాబాద్‌/హైదరాబాద్‌, సెప్టెంబరు 12: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత సోమవారం సాయంత్రం వైద్య పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాగా.. కవిత కరోనా బారిన పడినట్లు ప్రకటించడంతో శాసన మండలి సభ్యుల్లో కలకలం మొదలైంది. సోమవారం భోజన విరామం అనంతరం కవిత మండలి సమావేశానికి హాజరయ్యారు. ఆమె పక్కనే మరో ఎమ్మెల్సీ వాణిదేవి కూర్చున్నారు. కవితకు కరోనా ఉందని తెలియడంతో మిగతా సభ్యుల్లో కలవరం మొదలైంది. 

Read more