కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-08-31T09:30:05+05:30 IST

మంత్రి కేటీఆర్‌ కరోనా బారినపడ్డారు. కరోనాకు సంబంధించిన పలు లక్షణాలు ఉండటంతో మంగళవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌

 మంత్రి కేటీఆర్‌ కరోనా బారినపడ్డారు. కరోనాకు సంబంధించిన పలు లక్షణాలు ఉండటంతో మంగళవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పిన కేటీఆర్‌.. ఇటీవల తనని కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కాగా, కేటీఆర్‌ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లో కూడా  కేటీఆర్‌కు పాజిటివ్‌ అని తేలింది.  

Read more