మళ్లీ కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-06-07T05:35:32+05:30 IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్‌ నెలలో దేశీయంగా కొవిడ్‌ నాలుగో దశ తలెత్తవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి నాలుగో వేవ్‌ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

మళ్లీ కరోనా కలకలం

దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులు
అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
ముందస్తు చర్యలకు కార్యప్రణాళిక
మరింతగా పెరగనున్న పరీక్షలు
పల్లె, పట్టణ ప్రగతిలోనూ వ్యాక్సినేషన్‌
ఎంజీఎంలో సిద్ధంగా 250 పడకలు


హనుమకొండ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) :  దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  జూన్‌ నెలలో దేశీయంగా కొవిడ్‌ నాలుగో దశ తలెత్తవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి నాలుగో వేవ్‌ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నాలుగో దశ వైరస్‌ వ్యాప్తికి తావు లేకుండా ముందే పటిష్ఠ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రణాళికను సిద్ధం చేస్తోంది.  గతంలో మూడు దశల్లో నమోదైన కేసులు, కరోనా  వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్న  సందర్భంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ మహమ్మారిని నిలువరించేందుకు మరింత పకడ్బందీగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది.

మూడు దశల్లో...

తొలి రెండు దశల్లో జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. మొదటి దశలో 4,75,306 కరోనా పరీక్షలు జరపగా 13171 మందికి పాజిటివ్‌ అని తేలింది. రెండవ దశలో మరింత ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించారు. 7,33,951 మందికి పరీక్షలు జరిపారు. 15260 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరీక్షల సంఖ్యను పెంచడం, విస్తృతంగా వ్యాక్సినేషన్‌ జరపడం, ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించడం ద్వారా కరోనా లక్షణాలు కలిగిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తించడం, వీలైనంత వరకు వారు ఐసోలేషన్‌లో ఉండేట్టు చేయడం వంటి చర్యలను తీసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేశారు. దీంతో మూడవ దశ నాటికి కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. 2,46,300 మందికి పరీక్షలు జరపగా 3265 మందికి పాజిటివ్‌ అని   వచ్చింది. ఇంతటితోనే సరిపెట్టుకోకుండా వైద్యాధికారులు కరోనా నియంత్రణకు ఇప్పటికీ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో  కేసులు నమోదు అవుతున్నా ప్రస్తుతం అయితే జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు లేదు. మొదటి రెండు దశల్లో జిల్లాలో కరోనా వల్ల ప్రాణనష్టం కాస్త ఎక్కువగా ఉన్నా మూడవ దశలో ప్రాణనష్టం అంతగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.  

వ్యాక్సినేషన్‌
కొవిడ్‌ నియంత్రణలో భాగంగా జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 15-17 సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తి చేసిన తొలి జిల్లాగా హనుమకొండ నిలిచింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి 2 డోసులు పూర్తి చేయడంలో రెండవ స్థానంలో నిలిచింది. 12-14 సంవత్సరాలలోపు చిన్నారులకు మొదటి డోసు 107 శాతం, రెండవ డోసు 39 శాతం ఇచ్చారు.

కార్యాచరణ
ఒక వేళ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగితే ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్య. ఆరోగ్య శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించుకొని సిద్ధంగా ఉన్నారు. ఆక్సిజన్‌ పడకల నిర్వహణ వివరాలు సేకరించి పెట్టుకున్నారు. ర్యాపిడ్‌, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కిట్లతో పాటు ప్రత్యేక కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకెవరైనా వ్యాక్సిన్‌ పొందని వారుంటే ముఖ్యంగా టీనేజర్లను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఫ్రంట్‌ వారియర్స్‌లో ప్రికాషన్‌ డోస్‌ పొందనివారు ఎంత మంది ఉన్నారో వారి వివరాలు సేకరిస్తున్నారు.

పల్లె, పట్టణ ప్రగతిలో వాక్సినేషన్‌
- డాక్టర్‌ బి.సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ, హనుమకొండ

కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్ర ణాళికను సిద్ధం చేశాం.   పరీక్షలను మరింత పెం చేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం పూర్తి చేసే దిశగా సిబ్బందిని ప్రోత్సహిస్తున్నాం.   ప్రస్తుతం జిల్లా  వ్యాప్తంగా జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో రెండవ డోస్‌, బూ స్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌  తీసుకోనివారిని గుర్తించి వా రికి వ్యాక్సిన్లు ఇస్తున్నాం. కొత్త కరోనా కేసులేవి ఇప్పటి వరకు నమోదు కాలేదు. కరోనా లక్షణా లు కలిగినవారు మా దృష్టికి వస్తే వారికి కిట్లు ఇచ్చి ఐసోలేషన్‌లో ఉంచేలా చూస్తాం. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ వంటి నగరాల్లో నాల్గవ వేవ్‌ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నుంచి జిల్లాకు వచ్చేవారిపై దృష్టిసారించను న్నాం.. వారికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ అ ని తేలితే ఐసోలేషన్‌లో ఉంచుతాం. జనసమూ హం కలిగిన ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలి.

ఎంజీఎంలో సిద్ధంగా 250 పడకలు
- డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌,  ఎంజీఎం సూపరింటెండెంట్‌

నాల్గవ్‌ వేవ్‌లో ఒక వేళ కరోనా కేసులు పెరిగిన పక్షంలో రోగులకు తగిన చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఎం జీఎం ఆస్పత్రిలో ఉన్నా యి. 250 పడకలు సిద్ధం గా ఉన్నాయి. గతంలో వినియోగించిన 100 పడకలు అలాగే ఖాళీగా ఉంచాం. గైనకాలజీకి ఉద్దేశించిన మరో 100 పడకలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో మరో 50 పడకలు సిద్ధంగా ఉన్నాయి. 100  వెంటిలేటర్స్‌ ఉన్నా యి. ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నవారికి సత్వరం, సమర్ధవంతమైన చికిత్స అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. పరిస్థితిని బట్టి కరోనా టెస్టులు పెంచుతాం. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారు హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడేందుకు వీలుగా కావలసినన్ని కిట్స్‌కూడా ఉన్నాయి.

Read more