కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకనే రాజీనామా: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-02-19T21:09:05+05:30 IST

కాంగ్రెస్‌లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి.. ప్రజల్లోకి స్వతంత్రంగా వెళ్లి సేవ చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకనే రాజీనామా: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి.. ప్రజల్లోకి స్వతంత్రంగా వెళ్లి సేవ చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాశారు. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌లో సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ చీఫ్‌ కావొచ్చని లేఖలో తెలిపారు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారని, పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని.. కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌లో వివాదాలు ఉన్నా హుందాగా ఉండేదని, ఇప్పుడు లేదని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

Read more