దసరా రోజు సంచలన ప్రకటన చేస్తా: Jaggareddy

ABN , First Publish Date - 2022-07-08T15:15:04+05:30 IST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

దసరా రోజు సంచలన ప్రకటన చేస్తా: Jaggareddy

సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జగ్గారెడ్డి సమాధానం చెప్పారు. కాంగ్రెస్(Congress) వీడటం కలలో కూడా జరగని పని అని తేల్చిచెప్పారు. దసరా రోజున సంగారెడ్డి సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ‘‘టీఆర్ఎస్‌(TRS)లో నేను చేరతానని మీడియాలో వచ్చే అంచనాలు ఎప్పటికీ నిజం కాబోవు. నాలుగు నెలల పాటు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు నిర్వహించను... నియోజకవర్గానికే పరిమితం అవుతాను’’ అంటూ జగ్గారెడ్డి వెల్లడించారు. 

Read more