యశ్వంత్ సిన్హాను సీఎల్పీకి ఆహ్వానించి ఉండాల్సింది: Jagga reddy

ABN , First Publish Date - 2022-07-02T18:28:31+05:30 IST

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సీఎల్పీకి ఆహ్వానించి ఉండాల్సిందని... ఇందుకు భట్టి విక్రమార్క పార్టీ అధిష్ఠానంతో మాట్లాడాల్సిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

యశ్వంత్ సిన్హాను సీఎల్పీకి ఆహ్వానించి ఉండాల్సింది: Jagga reddy

హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwanth sinha)ను సీఎల్పీ (CLP)కి ఆహ్వానించి ఉండాల్సిందని... ఇందుకు భట్టి విక్రమార్క (Batti vikramarka) పార్టీ అధిష్ఠానంతో మాట్లాడాల్సిందని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga reddy) అన్నారు. భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. యూపీఏలో టీఆర్ఎస్ (TRS) - ఎంఐఎం (MIM) భాగ్యస్వామ్యం కాకపోయినా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హాను టీఆర్‌ఎస్ ఆహ్వానించిందన్నారు. కాంగ్రెస్, సీఎల్పీ తరపున మనమూ ఆహ్వానించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై భట్టిని తప్పుపడుతూ అధిష్ఠానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో లేని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హా  అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా యశ్వంత్‌కు మద్దతు ప్రకటించి వస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. Read more