తెలంగాణ ప్రజలు లోపభూయిష్ట సర్వేని నమ్మకండి: Sampath kumar

ABN , First Publish Date - 2022-07-15T19:30:05+05:30 IST

ఆరా సంస్థ యజమాని మస్తాన్ ప్రెస్ మీట్ పెట్టి మరి తెలంగాణ ప్రజల ఓటర్లను ప్రభావం చేయాలని చూశారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు లోపభూయిష్ట సర్వేని నమ్మకండి: Sampath kumar

హైదరాబాద్: ఆరా సంస్థ యజమాని మస్తాన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తెలంగాణ ప్రజల ఓటర్లను ప్రభావం చేయాలని చూశారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ఆ సర్వే వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఉన్నాయని ఆరోపించారు.  ‘‘మీరు చేసిన సర్వే ఎప్పుడు.. ఎక్కడ చేశారు.. ఎవరెవరిని కలిసారని ఆధారాలతో సహా ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. బీజేపీ డబ్బులకు అమ్ముడు పోయి మస్తాన్ రాజకీయ లాలూచీకి పాల్పడ్డారన్నారు. తెలంగాణ ప్రజలు లోపభూయిష్ట సర్వేని నమ్మవద్దని తెలిపారు. ‘‘మంత్రి కేటీఆర్... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి విమర్శించే ముందు నీ సిరిసిల్లను సరి చేసుకో... అక్కడ వర్షాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు’’ అంటూ సంపత్ మండిపడ్డారు. 

Read more