జిల్లాల్లో కాంగ్రెస్‌ ‘ఆజాదీకా గౌరవ్‌’ యాత్రలు

ABN , First Publish Date - 2022-08-10T09:42:53+05:30 IST

క్విట్‌ ఇండియా దినోత్సవం నుంచి స్వాతంత్య్ర దినోత్సవం వరకు ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో డీసీసీల ఆధ్వర్యంలో యాత్ర మొదలైంది.

జిల్లాల్లో కాంగ్రెస్‌ ‘ఆజాదీకా గౌరవ్‌’ యాత్రలు

హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): క్విట్‌ ఇండియా దినోత్సవం నుంచి స్వాతంత్య్ర దినోత్సవం వరకు ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో డీసీసీల ఆధ్వర్యంలో యాత్ర మొదలైంది. మంగళవారం నుంచి 15 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి జిల్లాలో జాతీయ జెండాలు చేబూని 75 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఇందులో భాగంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక కాంగ్రెస్‌ నేతలు యాత్ర మొదలుపెట్టారు.

Read more