పరిహారం, పునరావాసం కల్పించాలి

ABN , First Publish Date - 2022-11-30T00:15:05+05:30 IST

కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా బస్వాపూర్‌ రిజర్వార్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులందరికీ నష్ట పరిహారంతోపాటు పునరావాసం కల్పించాలని పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి కోరారు.

పరిహారం, పునరావాసం కల్పించాలి

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పనులను అడ్డుకుని దీక్షలు చేపట్టిన ముంపు నిర్వాసితులు

భువనగిరి రూరల్‌, నవంబరు 29: కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా బస్వాపూర్‌ రిజర్వార్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులందరికీ నష్ట పరిహారంతోపాటు పునరావాసం కల్పించాలని పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి కోరారు. మంగళవారం ముంపు నిర్వాసితులతో కలిసి దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, ప్రాజెక్టు, ఇరిగేషన్‌ అధికారులు స్పం దించి భూములకు నష్టపరిహారానికి కొత్త అవార్డును ప్రకటించి, ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పిన్నెం లతరాజు, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు, ఎడ్ల దర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:15:05+05:30 IST

Read more