Congressకు కమ్యూనిస్ట్‌ల షాక్? గెలుపు బాటలో ఒకడుగు ముందుకేసిన TRS!

ABN , First Publish Date - 2022-08-20T16:21:59+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి అండదండగా కమ్యూనిస్టులు ఉంటారని నిన్న మొన్నటి వరకూ ప్రచారం నడిచింది.

Congressకు కమ్యూనిస్ట్‌ల షాక్? గెలుపు బాటలో ఒకడుగు ముందుకేసిన TRS!

Hyderabad : కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి అండదండగా కమ్యూనిస్టులు(Communists) ఉంటారని నిన్న మొన్నటి వరకూ ప్రచారం నడిచింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. కారులోనే పయనించేందుకు కామ్రేడ్స్ సిద్ధమయ్యారు. మునుగోడులో టీఆర్ఎస్‌(TRS)కే సీపీఐ(CPI) మద్దతు తెలపనున్నట్టు సమాచారం. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్‌కే నేతలు జై కొట్టారు. హస్తంతో షేక్ హ్యాండ్‌కు విముఖత వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ చర్చల టీమ్‌కు సీపీఐ పెద్దలు కనీసం అపాయింట్‌మెంట్(Appointment) కూడా ఇవ్వకపోవడం గమనార్హం. నిన్న రాత్రి ప్రగతి భవన్(Pragathi Bhavan)కు వెళ్లి సీఎం కేసీఆర్‌(CM KCR)తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. నేడో రేపో మద్దతు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రోజు మునుగోడు సభలో పాల్గొని మద్దతు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐ దారిలోనే సీపీఎం(CPM).. టీఎర్ఎస్‌కు మద్దతు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 


ఒకరకంగా చెప్పాలంటే నల్గొండ జిల్లాలో వామపక్ష పార్టీలకు మంచి పట్టుంది. ఇక్కడ వీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దానికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ బాగా సద్వినియోగం చేసుకుని విజయం రేసులో ఒక అడుగు ముందుగు వెళ్లిపోయింది. బీజేపీతో నువ్వా-నేనా అన్నట్టుగా టీఆర్ఎస్ సాగిస్తున్న ఈ సమరంలో ఒకరకంగా టీఆర్ఎస్ అద్భుతమైన అడుగు వేసింది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌తోనే అనుకున్న వామపక్ష పార్టీలను నైట్‌కు నైట్‌కు తమ వైపు తిప్పుకోవడంలో సఫలమైందనే చెప్పాలి. 




Updated Date - 2022-08-20T16:21:59+05:30 IST