రైతుల అభిప్రాయాలు తీసుకుంటాం: కలెక్టర్
ABN , First Publish Date - 2022-02-23T06:09:42+05:30 IST
రైతుల అభిప్రాయాలు తీసుకుంటాం: కలెక్టర్

నెక్కొండ, ఫిబ్రవరి 22 : జాతీయ రహదారి నిర్మాణం లో రైతుల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుంటామని కలెక్టర్ బి.గోపి అన్నారు. నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంతో భూములు కోల్పోతున్న జిల్లా రైతులతో నెక్కొండలో వ్యవసాయ మార్కెట్ యార్డు లో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడారు. రూ.3 వేల కోట్లతో ఈ నేషనల్ హైవే తెలంగాణలోని 108 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుండగా.. హన్మకొండ, వ రంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలోని 48 గ్రా మాల మీదుగా పోతోందన్నారు. జాతీయ రహదారికి సం బంధించి కేవలం డాఫ్ర్టు రిపోర్టును మాత్రమే అధికారుల కు అందించామని, భూముల రైతుల నుంచి సంపూర్ణంగా అభిప్రాయాలను సేకరించిన తరువాతే ప్రభుత్వానికి అం దిస్తామని వివరించారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సర్వేలకు సంబంధించిన నివేదికలు ఇంగ్లీ్‌షలో ఉండటంతో ఆర్థం కావడంలేదని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని, సర్వే రిపోర్టులను తెలుగులో ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కె.శ్రీవాత్సవ, ఈఈ వెంకటనివాస్, నర్సంపేట, వరంగల్ ఆర్డీవోలు పవన్‌కుమార్, మ హేందర్జీ, నర్సంపేట ఏసీపీ ఫణిందర్, నెక్కొండ, అప్పల్రావుపేట సర్పంచ్‌లు సొంటిరెడ్డి యమునారెడ్డి, వడ్డె రజిత, నెక్కొండ, సంగెం తహసీల్దార్లు డీఎస్ వెంకన్న, రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.
రైతుల ఆగ్రహం..
రైతుల అభిప్రాయాలను తీసుకోకుండానే గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే అధికారులు తప్పుడు నివేదికలతో రహదారి నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారంటూ పలు గ్రామాల రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్వేలో 85 శాతం మంది రైతులు సుముఖతను వ్యక్తం చేసినట్లు ఎన్రో ల్మెంట్ పబ్లిక్ హియరింగ్ (ఈఐఏ) రిపోర్టులో అధికారు లు పొందుపర్చడంపై మండిపడ్డారు. అధికారులు సర్వేలను నిర్వహించలేదని, పర్యావరణ అనుమతులకు తప్పు డు రిపోర్టులను తయారు చేసిన అధికారులపై రాజద్రోహం కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జంతువులు, పక్షులు మృత్యువాత పడడమేకా, భారీ వృక్షా లు, కాకతీయుల కట్టడాలు, గొలుసుకట్టు చెరువులు కాలగర్భంలో కలుస్తున్నాయన్నారు. రైతుల అభిప్రాయాలను ప్ర భుత్వానికి కలెక్టర్ తెలియజేయాలని మానవహక్కుల వే దిక రాష్ట్ర కార్యదర్శి రాజ, వరంగల్ జిల్లా రైతులు రాజగోపాల్, మేకల సారయ్య, శ్రీనివాస్, మల్లారెడ్డి, నరేందర్, వీ రస్వామి, పెండ్లి సునీత కోరారు.
కలెక్టర్ ఎదుట మహిళా రైతు కన్నీరు..
హైవే నిర్మాణంతో తన కూతురుకి వివాహం సమయంలో ఇచ్చిన అరఎ కరం సాగుభూమి కోల్పోవాల్సి వస్తుందంటూ కలెక్టర్ సమక్షంలో గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన మ హిళ రైతు పెండ్లి సునీత కన్నీటిపర్యం తమైంది. భర్తను కోల్పోయి పుట్టెడుదుఃఖంలో ఉన్న తాను ఇప్పుడు భూమిని కోల్పోతే జీవనోపాధిని లేకుండాపోతుం దని కంటతడిపెట్టారు.