వ్యాక్సిన్‌ తీసుకున్న వారి జాబితా సిద్ధం చేయండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-29T05:25:11+05:30 IST

వ్యాక్సిన్‌ తీసుకున్న వారి జాబితా సిద్ధం చేయండి : కలెక్టర్‌

వ్యాక్సిన్‌ తీసుకున్న వారి జాబితా  సిద్ధం చేయండి : కలెక్టర్‌
మందపల్లిలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ గోపి

దుగ్గొండి, జనవరి 28: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారి జాబితా లను తయారు చేయాలని కలెక్టర్‌ బి.గోపి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని మందపల్లి, వెంకటాపురం ఆరోగ్య ఉప కేంద్రాలను, వెంకటాపురంలోని పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం పరి శీలించారు. మందపల్లిలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో రెండు డోసుల టీకాలు తీసుకున్నవారి జాబితాలు రూపొందించాలని, ఇం టింటి సర్వే చేసి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీసి మందులు అందజే యాలన్నారు.  రెండో డోస్‌ తీసుకోనివారికి వెంటనే టీకా ఇవ్వాలని చెప్పారు. జ్వరం, దగ్గు, ఒంటినొప్పులు ఉన్నవారికి కొవిడ్‌ కిట్లు అం దించాలన్నారు. వెంకటాపురం పల్లె ప్రకృతి వనం సందర్శించి సంతృ ప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, జి ల్లా ఆరోగ్య ఉప వైద్యాధికారి ప్రకాశ్‌, ఎంపీపీ కాట్ల కోమల, ఎంపీ డీవో కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ ప్రారంభం

వరంగల్‌ కలెక్టరేట్‌: మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా ఎదిగి, ఉన్నత శిఖరాలకు చేరాలని కలెక్టర్‌ బి.గోపి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఓరుగల్లు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. కార్యక్ర మంలో జిల్లా అదనపు కలెక్టర్లు కె.శ్రీవత్స, బి.హరిసింగ్‌, డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు పాల్గొన్నారు.


Read more