మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి... మోదీ జీ: KCR

ABN , First Publish Date - 2022-07-02T19:05:31+05:30 IST

భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి... మోదీ జీ: KCR

హైదరాబాద్: భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwanth sinha) రాక సందర్భంగా జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ప్రధాన మంత్రి మోదీ(Modi) ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారని, రెండు రోజులు పాటు ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారని అన్నారు. ఈ సందర్భంగా మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రధానిని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా పూర్తి చేశారా?.. చేస్తే ఏం చేశారో చెప్పండి?... నేను కాదు ప్రజలు అడుగుతున్నారు. దేశంలో రైతుల భాగస్వామ్యం చాలా పెద్దది. వారి ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు...చేయలేదు. కానీ ఖర్చు మాత్రం డబల్ అయింది. ఢిల్లీ ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు మేము సహాయం చేస్తే కూడా అవహేళన చేస్తున్నారు దేశ రైతులు బంగారం అడగడం లేదు, మద్దతు ధర అడుగుతున్నారు. ముందు ముందు ఇక మీ ఆటలు సాగవు. మోదీ కంటే ముందు చాలా మంది ప్రధానులు పనిచేశారు. ఎవరు శాశ్వతం కాదు’’ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. 
Read more