TS News: కేసీఆర్‌పై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2022-08-18T01:02:20+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR)పై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) ఫైర్ అయ్యారు.

TS News: కేసీఆర్‌పై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్

జనగామ: సీఎం కేసీఆర్‌ (CM KCR)పై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఏం చేసిందంటున్న కేసీఆర్ వికారాబాద్‌ (Vikarabad)కు ఏం చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రథమ శత్రవు ప్రధాని కాదని కేసీఆరేనని తెలిపారు. మునుగోడులో సర్పంచ్‌లు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టారని చెప్పారు. ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని ప్రధాని ఎక్కడా చెప్పలేదని, ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలని మాత్రమే చెప్పారని గుర్తుచేశారు. పిట్టల దొర తుపాకీ రాముడిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.


Read more