సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-17T06:19:55+05:30 IST

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం
మరిపెడ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌

డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావు

అంబరాన్నంటిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు

రాజీవ్‌గాంధీ సెంటర్‌ నుంచి కార్గిల్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ


మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), సెప్టెంబరు 16: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికే ఆదర్శమని డోర్నకల్‌ ఎమ్మె ల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. మరిపెడ మునిసిపల్‌ కేంద్రంలో తెలంగాణ జా తీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం మండల్‌ పరిషత్‌ ఆవరణలో జరిగిన సభకు జిల్లా అదన పు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావు హాజరై మాట్లాడారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా హె ౖదరాబాద్‌ సంస్థానం 1948 సెప్టెంబరు 17న  నిజాం రాజు ల పరిపాలన నుంచి ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం గా విముక్తి పొందిందని గుర్తు చేశారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధితో పాటు సం క్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామిగా నిలిపార న్నారు. ఇది ఒర్వలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కుట్రలు, మతచిచ్చు, కులాల మధ్య వ్యత్యాసం చూపి విచ్ఛిన్నకర కుట్రలు చేస్తుందని ఆరోపించారు. వీటిని ఎదుర్కొవడానికి ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.  సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నవీన్‌, డీసీబీబీ డైరెక్టర్‌ చాపల యాదగిరిరెడ్డి, అచ్యుత్‌రావు, మహేందర్‌ రెడ్డి, సతనారాయణరెడ్డి, గుగులోత్‌ వెంకన్న, తాళ్లపెల్లి శ్రీ నువాస్‌, ఆర్డీవో రమేశ్‌, నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ సు ధాకర్‌, ఎంపీపీ అరుణరాంబాబు, జడ్పీటీసీ శారదరవీందర్‌, మరిపెడ, డోర్నకల్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్లు గుగులోత్‌ సింధూరకుమారి, వాంకుడోత్‌ వీరన్న, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఘనంగా వజ్రోత్సవ ర్యాలీ

మరిపెడ మునిసిపల్‌ కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చేపట్టిన ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మునిసిపల్‌ కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు త్రీవర్ణ జెండాలతో తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతి, సంప్రాదాయాలు ప్రతిభింబించే డీజే పాటలకు కళాకారలు, మహిళలు నృత్యాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, జిల్లా అదనపు కలెక్టర్‌ స్థానిక మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. మరిపెడ పట్టణం మొత్తం మూడు రంగుల జెండాలతో కొత్తసొగసును అవతరించుకుంది. స్థానిక రాజీవ్‌గాంధీ సెంటర్‌ నుంచి కార్గిల్‌ సెంటర్‌ వరకు ర్యాలీ గంటన్నర పాటు సాగింది. వేడుకలకు హాజరైన ప్రతీ ఒక్కరికి భోజనాలు పెట్టారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా తొర్రూరు డీఎస్పీ రఘు, మరిపెడ సీఐ ఎన్‌.సాగర్‌, డివిజన్‌కు చెందిన ఎస్సైలు, అదనపు ఎస్సైలు భారీ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2022-09-17T06:19:55+05:30 IST