సీఎం కేసీఆర్‌ అబద్ధాల కోరు

ABN , First Publish Date - 2022-09-30T08:05:46+05:30 IST

సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాల కోరు అని, పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను నిలువు నా మోసం చేస్తున్నారని వైఎస్సాఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ అబద్ధాల కోరు

వైఎస్సార్‌ను కాంగ్రెస్‌ అవమానించింది: షర్మిల

హత్నూర, సెప్టెంబరు 29: సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాల కోరు అని, పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను నిలువు నా మోసం చేస్తున్నారని వైఎస్సాఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. గాడిదకు రంగుపూసి ఆవు అని చెబుతారని విమర్శించారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర, దౌల్తాబాద్‌ గ్రామాల మీదుగా గురువారం ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ.. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురికి పెద్ద ఉద్యోగాలు వచ్చాయని వ్యా ఖ్యానించారు. డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు లేక ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న వారి కుటుంబాల ఉసురు కేసీఆర్‌కు తగలడం ఖాయమన్నారు. బంగారు తెలంగాణ చే స్తున్నామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. బార్లు, బీర్ల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అరాచకాలను అడ్డుకోవడంలో కాంగ్రెస్‌, బీజేపీ విఫలమయ్యాయని, ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోవడంతో ఎనిమిదేళ్లుగా కేసీఆర్‌ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కుటుంబ పాలన ను అంతమొందించేందుకు ప్రజల సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ చనిపోయాక.. కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించిందని, ఇది వెన్నుపోటు పొడవడం కాదా? అని ప్రశ్నించారు. బతికున్నప్పుడు ఇం ద్రుడు, చంద్రుడు అన్నారని, మరణించాక ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేసి అవమానించారని దుయ్యబట్టారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోతే దర్యాప్తు కూడా చేయించలేదన్నారు. 

Read more