మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం

ABN , First Publish Date - 2022-12-13T00:30:12+05:30 IST

మ త్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృ షి చేస్తున్నారని ఎమ్మె ల్యే నోముల భగత అ న్నారు. సోమవారం సా గర్‌ హిల్‌కాలనీలో ఎర్త్‌ డ్యాం వద్ద ఉన్న చిల్డ్రన పార్కు పుష్కర ఘాట్‌ నుంచి కృష్ణానదిలో 16 లక్షల 66 వేల చేపపిల్లలను వ దిలి మాట్లాడారు.

 మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం
చేపపిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే భగత

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం

నాగార్జునసాగర్‌, డిసెంబరు 12: మ త్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృ షి చేస్తున్నారని ఎమ్మె ల్యే నోముల భగత అ న్నారు. సోమవారం సా గర్‌ హిల్‌కాలనీలో ఎర్త్‌ డ్యాం వద్ద ఉన్న చిల్డ్రన పార్కు పుష్కర ఘాట్‌ నుంచి కృష్ణానదిలో 16 లక్షల 66 వేల చేపపిల్లలను వ దిలి మాట్లాడారు. మత్స్యకారులను ఆదుకునేందుకు నదు ల్లో, చెరువుల్లో చేప పి ల్లలను వదులుతున్నట్లు తెలిపారు. అనంతరం హిల్‌కాలనీలో రూ.9 కోట్ల వ్య యంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి విజయవిహార్‌ అతిథిగృహంలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నందికొండ మునిసిపాలిటీలో వెజ్‌, నానవెజ్‌ మార్కెట్‌, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పనులు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మత్స్యశాఖ అధికారి సాల్మన, నందికొండ మునిసిపల్‌ చైర్‌పర్సన కర్ణ అ నూషశరతరెడ్డి, వైస్‌ చైర్మన రఘువీర్‌, ఎస్పీఎఫ్‌ కమాండెంట్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ భాస్కర్‌, సీఐ నాగరాజు, కౌన్సిలర్‌ రమే్‌షజీ, బీఆర్‌ఎస్‌ నాయకులు శరతరెడ్డి, రాంబాబు, మోహననాయక్‌, విక్రం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:30:13+05:30 IST