‘కౌన్బనేగా కరోడ్పతి’ పేరుతో రూ.3 కోట్లు దోచేసిన నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-05T16:33:42+05:30 IST

కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా ఉంది సైబర్ నేరగాళ్ల పని. రోజుకో కొత్త పద్ధతిని ఎంచుకుంటూ మోసాల్లో ఆరితేరిపోతున్నారు.

‘కౌన్బనేగా కరోడ్పతి’ పేరుతో రూ.3 కోట్లు దోచేసిన నిందితుల అరెస్ట్

Hyderabad : కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా ఉంది సైబర్ నేరగాళ్ల పని. రోజుకో కొత్త పద్ధతిని ఎంచుకుంటూ మోసాల్లో ఆరితేరిపోతున్నారు. తాజాగా అమితాబచ్చన్(Amithab) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్బనేగా కరోడ్పతి ప్రోగ్రాం పేరుతో కూడా మోసానికి పాల్పడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి మోసం కాదు.. ఏకంగా రూ.3 కోట్ల మోసం. ఇంత చేసినా పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. రూ.3 కోట్లు వసూలు చేసిన సైబర్ నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. సైబర్ పోలీసులు బీహార్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నిందితులపై పలు కేసులు నమోదయ్యాయి.

Read more