ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ మృతిపట్ల చంద్ర‌బాబు సంతాపం

ABN , First Publish Date - 2022-01-28T17:28:36+05:30 IST

ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు సంతాపం తెలిపారు.

ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ మృతిపట్ల చంద్ర‌బాబు సంతాపం

అమ‌రావ‌తి: ద‌ళిత సాహితీవేత్త, ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు సంతాపం తెలిపారు. తెలుగు ర‌చ‌నా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎండ్లూరి సుధాక‌ర్ మృతి సాహితీ లోకానికి తీర‌ని లోటని అన్నారు. ఉత్తేజ పూరిత రచ‌న‌ల‌తో స‌మాజంపై ఎండ్లూరి త‌న‌దైన ముద్ర వేశారని చంద్ర‌బాబు కొనియాడారు. ద‌ళిత ర‌చ‌యిత‌గా సుధాక‌ర్ ర‌చ‌న‌లు ఎందరికో స్ఫూర్తినిచ్చాయ‌న్నారు. తెలుగు ఆచార్యునిగా ఎంద‌రో విద్యార్థులు, ప‌రిశోధ‌కుల‌కు మార్గ‌నిర్దేశం చేశారన్నారు. ఈ సంద‌ర్భంగా ఎండ్లూరి కుటుంబ స‌భ్యుల‌కు చంద్ర‌బాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎండ్లూరి సుధాకర్ శుక్ర‌వారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Read more