చాడ వర్సెస్‌ కూనంనేని

ABN , First Publish Date - 2022-09-08T09:40:43+05:30 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య పోటీ నెలకొంది.

చాడ వర్సెస్‌ కూనంనేని

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికపై  ఉత్కంఠ
  • మరోసారి అవకాశమివ్వాలంటున్న చాడ వెంకట్‌రెడ్డి
  • లేదంటే పల్లా వెంకట్‌రెడ్డిని ఎన్నుకోవాలని సూచన 
  • తనకే పదవి కట్టబెట్టాలని పట్టుబట్టిన కూనంనేని
  • రాత్రి 11 వరకు ఉత్కంఠ భరితంగా సాగిన చర్చలు


రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబర్‌ 7: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య పోటీ నెలకొంది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర మూడో మహాసభల ముగింపు సందర్భంగా శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌ హాల్లో ఎన్నిక వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. రాత్రి 11 ంటలకూ ఉత్కంఠ భరింతంగా చర్చలు సాగాయి. రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి తనకు అవకాశమివ్వాలని చాడ వెంకట్‌రెడ్డి కోరగా.. తనకు అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పట్టుబట్టారు. అయితే కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న చాడ వెంకట్‌రెడ్డి తనకు మరోసారి అవకాశం ఇవ్వని పక్షంలో మరో నాయకుడు పల్లా వెంకట్‌రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాగైనా సరే కూనంనేకి అవకాశమివ్వకుండా అడ్డుకోవడమే చాడ వ్యూహంగా కనిపిస్తోందని పార్టీ ఇతర సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కార్యదర్శి ఎన్నికపై ఎన్నికలు నిర్వహించి తేల్చాలని కూనంనేని నాయకత్వాన్ని పట్టుబడుతున్నట్లు సమాచారం.

Updated Date - 2022-09-08T09:40:43+05:30 IST