నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-06-07T05:34:33+05:30 IST

నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి

నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి 

చెన్నారావుపేట, జూన్‌ 6: రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ జిల్లా చెన్నా రావుపేట మండలం  అమీన్‌పేట గ్రామ శివారు అమీనాబాద్‌లో సర్వే నెంబర్‌ 2532/56, 57, 25, 27లో ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసిన స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో సీపీఐ ఆఽఽధ్వర్యంలో పేదలకు గుడిసెలను వేస్తామన్నారు. గుడిసెలు వేసుకున్నవారిపై ప్రభుత్వం కేసులు పెట్టించటం విచారకరమని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇంటి స్థలాలకు పట్టాలను అందిం చేవారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్‌ యావత్‌ భారతదేశం సిగ్గుపడే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్ర జెండాలతో పెట్టుకుంటే సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. 

ప్రభుత్వ భూమి రికార్డులు మార్చిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరుపేదలకు ప్రభుత్వం 125 గజాల భూమిని ఇవ్వాలన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపెల్లి శ్రీనివాసరా వు  పంజాల రమేష్‌, జిల్లా నాయకులు కందిక చెన్నకేశవులు, లక్ష్మణ్‌, మంద కుమార్‌, రాజు, కవిత, రాజమ్మ, సూరమ్మ, శకుంతల, కీరమ్మ పాల్గొన్నారు. Read more