కార్డియలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా అపోలో ఆస్పత్రి డాక్టర్‌ పీసీ రత్‌

ABN , First Publish Date - 2022-12-13T04:04:02+05:30 IST

కార్డియలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్‌ పీసీ రత్‌ ఎన్నియ్యారు. చెన్నైలో జరిగిన కార్డియలాజికల్‌ సొసైటీ వార్షిక సమావేశంలో 2023-24 సంవత్సరానికిగాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

కార్డియలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా   అధ్యక్షుడిగా అపోలో ఆస్పత్రి డాక్టర్‌ పీసీ రత్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కార్డియలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్‌ పీసీ రత్‌ ఎన్నియ్యారు. చెన్నైలో జరిగిన కార్డియలాజికల్‌ సొసైటీ వార్షిక సమావేశంలో 2023-24 సంవత్సరానికిగాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అపోలో ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగాధిపతిగా సేవలు అందిస్తున్న ఆయన కాంప్లెక్స్‌ కరోనరీ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్‌, రోబోటిక్‌ యాంజియోపాస్టస్లీ, పెర్క్యుటెనీయస్‌ వాల్వ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొసీజర్స్‌ (టీఏవీఐ) వంటి అనేక వైద్య ప్రక్రియలకు మార్గదర్శకత్వం వహించారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన భారతీయ కార్డియాలజిస్టులకు చెందిన జాతీయ సంస్థ ఇదని, ఇందులో ఐదువేలకన్నా ఎక్కువ మంది సభ్యులున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోల్‌కతాలో వచ్చే ఏడాది డిసెంబరులో జరగనున్న సొసైటీ 75వ వార్షికోత్సవంలో సైంటిఫిక్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించడంలో డాక్టర్‌ పీసీ రత్‌ కీలక పాత్ర పోషించనున్నారు.

Updated Date - 2022-12-13T04:04:03+05:30 IST