కేబుల్ బ్రిడ్జి అప్‌డేట్... 18 గంటలైనా దొరకని మహిళ..

ABN , First Publish Date - 2022-09-29T17:39:54+05:30 IST

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి (Madapur Cable Bridge)పై నుంచి దూకిన మహిళ ఇంకా లభ్యం కాలేదు. నిన్న మధ్యాహ్నం

కేబుల్ బ్రిడ్జి అప్‌డేట్... 18 గంటలైనా దొరకని మహిళ..

Hyderabad : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి (Madapur Cable Bridge)పై నుంచి దూకిన మహిళ ఇంకా లభ్యం కాలేదు. నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువు (Durgam Lake)లోకి స్వప్న అనే మహిళ దూకింది. 18 గంటలు గడుస్తున్నా ఆమెను కనుగొనలేకపోయారు. జీహెచ్ఎంసీ (GHMC), డీఆర్ఎఫ్ (DRF) బృందాలు స్వప్న కోసం దుర్గం చెరువును జల్లెడ పడుతున్నాయి. నేడు మరోసారి స్పీడ్ బోట్స్, డీఆర్ఎఫ్ సిబ్బందిని పోలీసులు రంగంలోకి దింపారు. దుర్గం చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో ఆమె ఏమైనా చిక్కుకొని పోయి ఉంటుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్‌కు లోను కావడంతోనే దుర్గం చెరువులోకి దూకినట్టు పోలీసులు భావిస్తున్నారు.


Read more