బీజేపీలో చేరిన సర్పంచ్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-10-03T09:44:48+05:30 IST

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామ సర్పంచ్‌ పగిళ్ల భిక్షమయ్య పార్టీ మారడంపై వామపక్ష పార్టీల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీలో చేరిన సర్పంచ్‌ దిష్టిబొమ్మ దహనం

కల్వకుంట్లలో దిష్టిబొమ్మకు శవయాత్ర చేసిన వామపక్ష కార్యకర్తలు 

మునుగోడురూరల్‌, అక్టోబరు 2: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామ సర్పంచ్‌ పగిళ్ల భిక్షమయ్య పార్టీ మారడంపై వామపక్ష పార్టీల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో సీపీఎం నుంచి గెలిచి బీజేపీలో చేరిన సర్పంచ్‌ దిష్టిబొమ్మకు ఆదివారం శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి మిర్యాల భరత్‌ మాట్లాడుతూ, నమ్మి గెలిపిస్తే సర్పంచ్‌ భిక్షమయ్య ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పదవికి రాజీనామా చేయకుండా ఆయన పార్టీ మారడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారినప్పుడు తన పదవికి రాజీనామా చేశారని, అలాంటప్పుడు పార్టీలో చేర్చుకునే సమయంలో ప్రజాప్రతినిధులను ఎందుకు రాజీనామా చేయమని అడగడం లేదని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు.

Read more