అంబేడ్కర్‌ వారసుడు మోదీయే: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-06-25T09:42:26+05:30 IST

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వారసుడు ప్రధాని మోదీయే నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆదివాసీ

అంబేడ్కర్‌ వారసుడు మోదీయే: బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వారసుడు ప్రధాని మోదీయే నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యక్ష ఓటు ద్వారా భాగస్వామ్యం కాబోతున్న సంజయ్‌కి శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్‌ తదితరులు సన్మానం చేశారు. 3న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు ఆదివాసీ జాతి మొత్తం కదిలి రావాలని సంజయ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-06-25T09:42:26+05:30 IST