Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకే నవ వధువు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-29T16:31:00+05:30 IST

అనుమానాస్పదస్థితిలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే... గద్వాల జిల్లా ఆలూరు ప్రాంతానికి

Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకే నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: అనుమానాస్పదస్థితిలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే... గద్వాల జిల్లా ఆలూరు ప్రాంతానికి చెందిన గోవిందమ్మ కుమార్తె రేణమ్మ(19)కు అదే జిల్లా కేతిరెడ్డిపల్లి మండలం తూర్పు తండాకు చెందిన శ్రీనివా్‌సతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాస్‌ రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన నాటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ గొడవ పడగా రేణమ్మ కుటుంబ సభ్యులు సర్ధి చెప్పారు. బుధవారం ఉదయం అల్లుడు శ్రీనివాస్‌ అత్తింటి వారికి ఫోన్‌ చేసి మీ కుమార్తె ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. రేణమ్మ తల్లిదండ్రులు, బంధువులు తమ కుమార్తెను భర్త శ్రీనివాస్‌ హత్య చేసి అత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ బి.నాగేంద్రబాబు నిందితుడు ఽశ్రీనివా్‌సను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more