బండి సంజయ్‌కు అస్వస్థత... పాదయాత్ర శిబిరం వద్ద చికిత్స

ABN , First Publish Date - 2022-04-25T00:37:42+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ..

బండి సంజయ్‌కు అస్వస్థత... పాదయాత్ర శిబిరం వద్ద చికిత్స

నర్వ, నారాయణపేట జిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 11 రోజులుగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ బండి సంజయ్ నారాయణపేట జిల్లా నర్వలో పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటుండగా ఆయన ఒక్కసారిగా నీరసపడ్డారు. దీంతో ఆయనను పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ మాట్లాడుతూ వడ దెబ్బ, ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా ఉన్నారన్నారు. బండి సంజయ్ కొంత విరామం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.  బండి సంజయ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ శరత్ చెప్పారు. అయితే బండి సంజయ్ పాదయాత్ర చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాసేపట్లో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. 


Read more