టార్గెట్ మునుగోడు.. బీజేపీ స్ట్రాటజీ కమిటీ కీలక సమావేశం

ABN , First Publish Date - 2022-09-24T19:29:13+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక (Munugode bypoll)పై బీజేపీ కార్యాలయం (BJP Office)లో బీజేపీ ప్రముఖ నేత వివేక్ (Vivek) ఆధ్వర్యంలో

టార్గెట్ మునుగోడు.. బీజేపీ స్ట్రాటజీ కమిటీ కీలక సమావేశం

Hyderabad : మునుగోడు ఉప ఎన్నిక (Munugode bypoll)పై బీజేపీ కార్యాలయం (BJP Office)లో బీజేపీ ప్రముఖ నేత వివేక్ (Vivek) ఆధ్వర్యంలో స్ట్రాటజీ కమిటీ (Stratagy committee) కీలక సమావేశం నిర్వహిస్తోంది. రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) రాజీనామా అనంతరం మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో తన స్థానాన్ని నిలుపుకోవాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. మునుగోడులో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామాల వారీగా కమిటీలు వేసి మరీ సర్వేలు నిర్వహించింది. ఈ సర్వే రిపోర్టులపైనే కమలం పార్టీ నేతలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారం, ఎన్నిక వ్యూహాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్ (Etela Rajender), జితేందర్ రెడ్డి (Jithender Reddy), గరికపాటి, మనోహరరెడ్డి, స్వామి గౌడ్ తదితరులు హాజరయ్యారు. 


Read more