తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు

ABN , First Publish Date - 2022-12-09T11:07:29+05:30 IST

రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఒకవైపు ఫామ్ హౌస్ కేసు, మరోవైపు లిక్కర్ కేసుతో టీఆర్‌ఎస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు

హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఒకవైపు ఫామ్ హౌస్ కేసు, మరోవైపు లిక్కర్ కేసుతో టీఆర్‌ఎస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్ రానున్నారు. ఈ నెల 28, 29న హైదరాబాద్ జరగనున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు విస్తారక్‌ల (ఫుల్ టైమర్స్)శిక్షణ సదస్సును నిర్వహించనున్నారు. శిక్షణ సదస్సులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 80 మంది పార్లమెంట్ విస్తారక్‌లు పాల్గొననున్నారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సైతం పాల్గొననున్నారు. టార్గెట్ సౌత్.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. నార్త్‌తో పాటు సౌత్‌లో పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. బలహీనంగా ఉన్న కేరళ, తమిళనాడుపై సైతం ఫోకస్ పెట్టనుంది. కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా విస్తారక్‌లకు శిక్షణ ఇవ్వనుంది.

Updated Date - 2022-12-09T11:07:30+05:30 IST