Dharmapuri Arvind: తెలంగాణలో అధికారం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం

ABN , First Publish Date - 2022-09-17T18:11:33+05:30 IST

తెలంగాణలో ఆధికారంలోకి రావటానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని ఎంపీ ధర్మపురతి అరవింద్ అన్నారు.

Dharmapuri Arvind: తెలంగాణలో అధికారం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఆధికారంలోకి రావటానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...విమోచన దినోత్సవంపై ఎమ్మెల్సీ  కవిత (MLC Kavita) ట్వీట్స్‌ను ఎంపీ ఖండించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని గతంలో కవిత (Kavita), కేటీఆర్‌ (KTR)లు లక్ష సార్లు డిమాండ్ చేశారని గుర్తుచేశారు.  విమోచన దినోత్సవంపై కేసీఆర్ కుటుంబం తీరు దురదృష్టమన్నారు.  విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించటంపై తెలంగాణ సమాజం హర్షిస్తోందని తెలిపారు. విమోచన దినోత్సవం మాత్రమే.. జాతీయ సమైక్య దినోత్సవం కాదని స్పష్టం చేశారు. అమరవీరులను సీఎం కేసీఆర్ (CM KCR) అగౌరవపరిచారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. 

Read more