నాకు కేసులు కొత్త కాదు: Raghunandan rao

ABN , First Publish Date - 2022-06-07T18:03:25+05:30 IST

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

నాకు కేసులు కొత్త కాదు: Raghunandan rao

హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు‌(Raghunandan rao)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... తనకు కేసులు కొత్త కాదని అన్నారు. పోలీసుల నోటీసుల కోసం బీజేపీ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలసి రాజకీయంగా నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఇదే మెదటి.. చివరి ఎఫ్ఐఆర్ కాదని, ఉద్యమంలో పోరాడిన వాడినని తెలిపారు. చట్టం తెలిసిన వాడిగా సాక్ష్యాలను మాత్రమే బయట పెట్టినట్లు తెలిపారు. కేసులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. 

Read more