KCR BRS.. ట్విట్టర్‌లో బీజేపీ సెటైర్లు

ABN , First Publish Date - 2022-10-06T02:59:39+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పేరు ప్రకటించారు. ఇంతకాలం టీఆర్ఎస్‌గా పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చారు. దీంతో....

KCR BRS.. ట్విట్టర్‌లో బీజేపీ సెటైర్లు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఇంతకాలం టీఆర్ఎస్‌గా ఉన్న పార్టీ పేరును ఆయన బీఆర్ఎస్‌గా మార్చారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు.. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్‌పై సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి.. బీఆర్ఎస్ పార్టీ‌పై ట్వీట్టర్ ద్వారా వ్యంగాస్త్రాలు సంధించారు. అలాగే మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సెటైర్స్ వేశారు. కేటీఆర్ ట్విట్టర్ టిల్లు గేమ్ చేంజర్ అని.. తండ్రి కేసీఆర్ నేమ్ చేంజర్ అయ్యారని..  అంతిమంగా ప్రజలు ఫేట్ చేంజర్ అవుతారని బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. 


మరోవైపు బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయన్నారు.  బీఆర్‌ఎస్‌ పేరుతో కేసీఆర్‌ మరో కొత్త డ్రామా ఆడుతున్నారని చెప్పారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? అని ప్రశ్నించారు.  లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్ లక్ష్యమా? అని లక్ష్మణ్ నిలదీశారు. 

Read more