హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక ఛానల్, పేపర్‌పై ఫిర్యాదు..!

ABN , First Publish Date - 2022-02-23T14:30:36+05:30 IST

రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు హస్తినకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ కీలక నేతలు డీకే అరుణ సహా 20మంది..

హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక ఛానల్, పేపర్‌పై ఫిర్యాదు..!

హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు హస్తినకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ కీలక నేతలు డీకే అరుణ సహా 20మంది ఉదయం 10గంలకు బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ నివాసంలో సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ కూటమి ప్లాన్‌కు కౌంటర్ ఎజెండాపై చర్చ జరగనుంది. బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులపై ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఒక ఛానల్, పేపర్‌పై కూడా ఫిర్యాదు చేయనున్నారు. బీజేపీ నేతలు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి, ఉభయ సభల కార్యదర్శులకు వినతి పత్రం సమర్పించనున్నారు.

Read more