Telangana లో పరిస్థితులు నీచాతినీచంగా దిగజారిపోతున్నాయ్

ABN , First Publish Date - 2022-07-09T04:03:59+05:30 IST

తెలంగాణలో పరిస్థితులు నీచాతినీచంగా దిగజారిపోతున్నాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

Telangana లో పరిస్థితులు నీచాతినీచంగా దిగజారిపోతున్నాయ్

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో పరిస్థితులు నీచాతినీచంగా దిగజారిపోతున్నాయని బీజేపీ(BJP) నేత విజయశాంతి(Vijaya Shanti) అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌(Kollapur)లో మహిళా వీఆర్‌ఏ(VRA) జరిగిన దుశ్శాసన పర్వం ఇందుకు పెద్ద ఉదాహరణగా ఆమె అభివర్ణించారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్(Facebook) వేదికగా స్పందించారు. పోస్ట్ యథాతథంగా ‘‘ ఇసుక అక్రమాల గురించి అధికారులకు సమాచారం ఇస్తున్నారన్న కోపంతో బస్సులో ఉన్న మహిళా వీఆర్ఏని ఒక టీఆరెస్ కార్యకర్త దారుణంగా అవమానించాడు. ఆ వీఆర్‌ఏని చీర పట్టి గుంజి, జుట్టుపట్టి లాగాడు. ప్రయాణికుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించాడు. ట్రాక్టర్‌తో చంపేస్తానని బెదిరించాడు. ముఖం, చర్మం ఎర్రబడేలా కొట్టాడు. అధికార పార్టీయే కాదు.... యావత్ తెలంగాణ సిగ్గు పడేలా జరిగిన ఈ ఘటనలో నాగ మల్లయ్య అనే ఆ టీఆరెస్ కార్యకర్తను కాపాడేందుకు పోలీసులు కూడా ముందుకు రావడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఈ దాడిపై సదరు వీఆర్ఏ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ టీఆరెస్ కార్యకర్త అక్కడకి కూడా వచ్చి ఆమెను చంపేస్తానని బెదిరించాడంటే రాష్ట్రంలో మహిళా రక్షణ, చట్టాల అమలు ఎంత గొప్పగా ఉన్నయో అర్థమవుతోంది. ఆమెపై జరిగిన దాడి గుర్తుగా దెబ్బలు కళ్ళకు కనబడుతున్నా పోలీసులు ఆ టీఆరెస్ కార్యకర్తని కొద్దిసేపు ఉంచి పంపేశారని మీడియా వెల్లడించింది. కేసీఆర్ పాలన ఎంత గొప్పగా ఉందో ఇంతకంటే చెప్పాల్సిన పనిలేదు.’’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2022-07-09T04:03:59+05:30 IST