కేసీఆర్ ఫస్ట్రేషన్‌లో ఉన్నారు: Laxman

ABN , First Publish Date - 2022-07-11T19:27:49+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్టేషన్‌లో ఉన్నారని, పైసలు లేకుండా కేసీఆర్ సినిమా చూపించారని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సెటైర్లు విసిరారు.

కేసీఆర్ ఫస్ట్రేషన్‌లో ఉన్నారు: Laxman

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఫస్ట్రేషన్‌లో ఉన్నారని, పైసలు లేకుండా కేసీఆర్ సినిమా చూపించారని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(Laxman) సెటైర్లు విసిరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం హోదాను దిగజార్చే విధంగా ప్రధానిని విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ(Telangana)కు టీఆర్ఎస్ శనిలా మారిందని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడమే సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో యూపీ(UP) తరహా పాలన రావాలన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్.. జీడీపీ(GDP), ప్రధాని మోదీ(Modi)పై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ ఈజ్ నాట్ ఎ ఫైటర్... హీ (కేసీఆర్) ఈజ్ ఎ చీటర్ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. 

Read more