కేసీఆర్ బీజేపీని అణిచివేసే కుట్రలు పన్నుతున్నారు: Bandi sanjay

ABN , First Publish Date - 2022-02-23T19:24:50+05:30 IST

కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి బీజేపీ పోరాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ బీజేపీని అణిచివేసే కుట్రలు పన్నుతున్నారు: Bandi sanjay

న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి బీజేపీ పోరాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ బీజేపీని అణిచివేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చేరదిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను అవాస్తవాలుగా.. అబద్ధాలను నిజంగా చెప్తున్నారన్నారు. మీడియా సంస్థలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవుస్తుందన్నారు. ప్రధాని పార్లమెంట్‌లో మాట్లాడిన అంశాలను వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యకత్ం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించిన చానెల్‌పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. 

Read more