కేటీఆర్..నీ అయ్య తెలంగాణ ద్రోహి: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-03-18T20:16:12+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేటీఆర్..నీ అయ్య తెలంగాణ ద్రోహి: బండి సంజయ్

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  బహిరంగ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని సీఎంను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేటీఆర్..నీ అయ్య తెలంగాణ ద్రోహి.. పార్లమెంట్‌లో తెలంగాణ చర్చలో కేసీఆర్ లేడు.. కేసీఆర్ తాగి పడుకున్నాడు.. దొంగ దీక్షలు చేశాడు.. మాది టీఆర్ఎస్ లాగా ఏక్ నిరంజన్ పార్టీ కాదు..నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయం.. టూత్ పాలిష్ వ్యక్తుల సవాళ్లకు స్పందించను’’ అంట బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. జాతీయ రహదారులకు, ఉపాధి హామీకి నిధులు తెచ్చింది తానే అని బండి సంజయ్ తెలిపారు. 

Read more