రేపు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు

ABN , First Publish Date - 2022-03-21T01:10:46+05:30 IST

సోమవారం బోధన బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులను కోరారు. బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు రెండు

రేపు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు

బోధన్: సోమవారం బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులను కోరారు. బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు రెండు వర్గాల మధ్య వివాదానికి తావిచ్చింది. అర్ధరాత్రి విగ్రహాన్ని పెట్టడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జిని, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఇరు వర్గాలను అక్కడ నుంచి తరిమికొట్టారు. బోధన్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు 144 సెక్షన్‌ను విధించారు. విగ్రహంతో పాటు బోధన్‌ అన్ని చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్లనే ఈ వివాదం ఏర్పడిందని పోలీసులు ప్రకటించారు. విగ్రహం వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు

Read more