సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-08-17T10:26:50+05:30 IST

వికారాబాద్‌లో మంగళవారం కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ

వికారాబాద్‌లో అడ్డగింత.. కార్యకర్తల అరెస్టు

మర్పల్లి/వికారాబాద్‌: వికారాబాద్‌లో మంగళవారం కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి.. స్థానిక ఎమ్మెల్యే నివాసానికి వెళుతుండగా ఎస్పీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు కాన్వాయ్‌కు ఎదురుగా వచ్చారు. జేబుల్లో నుంచి బీజేపీ కండువాలు తీసి ప్రదర్శిస్తూ ‘సీఎం గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు తేరుకునేలోపే వారు రోడ్డుపైకి రావడంతో కాన్వాయ్‌ కొద్దిసేపు ఆగిపోయింది. దీంతో పోలీసులు పక్కకు తప్పించి అదుపులోకి తీసుకున్నారు. 16 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని వారితో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. కాగా, అదుపులోకి తీసుకున్న నాయకులను పోలీసులు సాయంత్రం విడిచిపెట్టారు.

Read more