BJP యాక్షన్ ప్లాన్ రెడీ.. మునుగోడులో దూకుడే..

ABN , First Publish Date - 2022-10-03T16:17:41+05:30 IST

మునుగోడు (Munugode)లో బీజేపీ (BJP) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బీజేపీ యాక్షన్ ప్లాన్‌ (Action Plan)ను సిద్ధం చేసింది.

BJP యాక్షన్ ప్లాన్ రెడీ.. మునుగోడులో దూకుడే..

Nalgonda : మునుగోడు (Munugode)లో బీజేపీ (BJP) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బీజేపీ యాక్షన్ ప్లాన్‌ (Action Plan)ను సిద్ధం చేసింది. 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక (Munugode bypoll) నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని కమలం పార్టీ చెబుతోంది. దసరా తరువాతి రోజు నుంచి మునుగోడుపై దండయాత్రకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. 7వ తేదీ నుంచి మునుగోడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ (Bandi Sanjay) ఫోకస్ చేయనున్నారు.‌ ప్రస్తుతం బండి సంజయ్ భవానీ దీక్షలో ఉన్నారు. ప్రతి నేత.. ప్రతి ఇంటిని టచ్ చేసేలా ప్రచారానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈనెల 7న మునుగోడులో అన్ని గ్రామాల్లో బీజేపీ బైక్ యాత్రలు నిర్వహించనుంది. 10వ తేదీన బూత్ కమిటీ సభ్యలతో బండి సంజయ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. 189 గ్రామాల్లో జరగనున్న బైక్ యాత్రల్లో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. మునుగోడులో నకిలీ ఓట్లపై కమలం పార్టీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఓటర్ లిస్టు (Voter List)ను వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. 

Read more