చేపల చెరువు వివాదం

ABN , First Publish Date - 2022-02-23T05:49:55+05:30 IST

చేపల చెరువు వివాదం

చేపల చెరువు వివాదం

  రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన ఎన్నికలు

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 22: భీమదేవరపల్లి మండలం వంగర, రంగయ్యపల్లి గ్రామాల మధ్య చేపల చెరువు వివాదం నెలకొంది. ఈనెల 10న మత్స్య సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. వంగరకు చెందిన ఐదుగురు, రంగయ్యపల్లికి చెందిన 12మంది నామినేషన్లు వేశారు. ఇందులో రంగయ్యపల్లికి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాగా, 81మంది సభ్యులున్న రంగయ్యపల్లి గ్రామస్థులే గెలుస్తారని, వంగర గ్రామస్థులు ఎన్నికలను మంగళవారం బహిష్కరించారు. అనంతరం రంగయ్యపల్లి, వంగర గ్రామాలకు చెందిన 14మంది డైరెక్టర్లకు బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించారు. వంగర గ్రామస్థులు మొత్తం ఎన్నికలు బహిష్కరించడంతో రంగయ్యపల్లికి చెందిన తొమ్మిది మంది ఎన్నికైనట్లు ఎన్నికలాధికారి రవీందర్‌ తెలిపారు. అయితే తాము ఎన్నికలు బహిష్కరిస్తే ఏకగ్రీవంగా అధికారులు ఎన్నికలు నిర్వహించారని వంగర మత్స్యకార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంగర గ్రామపంచాయతీలో పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 144 ఓట్లకు గాను 63 మంది వంగర గ్రామస్థులు ఓట్లను బహిష్కరించగా 68 మంది రంగయ్యపల్లి గ్రామస్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

Read more