విప్రచిత్తా క్రమంలో అమ్మవారు

ABN , First Publish Date - 2022-07-06T05:18:56+05:30 IST

విప్రచిత్తా క్రమంలో అమ్మవారు

విప్రచిత్తా క్రమంలో అమ్మవారు

 ఆరో రోజుకు చేరిన శాకంబరీ ఉత్సవాలు

హనుమకొండ కల్చరల్‌, జూలై 5: నగరవాసుల పాలిట కొంగుబంగారంగా బాసిల్లుతున్న ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శాకంబరీ వేడుకలు మంగళవారం ఆరోరోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం అనంతరం ఉత్సవమూర్తులలో ఇచ్ఛాశక్తిని కాళిక్రమాన్ని అనుసరించి విప్రచిత్తా మాతగా శోభాయమానంగా అలంకరింపజేసి పూజారాధనలు నిర్వహించారు. సాయంత్రం శోడసిక్రమాన్ని అనుసరించి మహావజ్రేశ్వరిగా అలంకరింపజేసి పూజ ఆరాధనలు నిర్వహింపజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో కుమారశష్టి సందర్భంగా ఆలయంలోని సుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయాన్ని దర్శించుకున్న వారిలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బాల మాయాదేవి, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ఉన్నారు.

Read more