Bhadrachalam temple: వీరలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయరు అమ్మవారు

ABN , First Publish Date - 2022-10-03T13:56:52+05:30 IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Bhadrachalam temple: వీరలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయరు అమ్మవారు

భద్రాద్రి: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు (devi sharannavaratri celebrations ) ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజైన నేడు వీరలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం 8 గంటలకు (మూలమూర్తికి) అమ్మవారికి పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక కుంకుమ అర్చనలు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం జరుగనుంది. రేపు  మహా లక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 5న ఉత్సవాల్లో చివరి రోజున విజయదశమి వేడుకలు జరుగనున్నాయి. సీతారాములు పట్టాభిషేకం, దసరా మండపం వద్ద విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీ రామ లీలా మహోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు. 

Read more