ఎడ్ల బండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు

ABN , First Publish Date - 2022-09-22T05:16:43+05:30 IST

ఎడ్ల బండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు

ఎడ్ల బండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు
చర్లపల్లిలో అచ్చ సుదర్శన్‌ను ఎడ్ల బండిపై ఊరేగింపుగా తీసుకువస్తున్న విద్యార్థులు

బెస్ట్‌ టీచర్‌ అవార్డు వచ్చినందుకు విద్యార్థుల కానుక

నడికూడ, సెప్టెంబరు 21: నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాగా, బుధవారం చర్లపల్లి గ్రామంలో ఎడ్లబండిపై కూర్చోబెట్టి విద్యార్థులు ఊరేగింపుగా పాఠశాలకు తీసుకువచ్చి గౌరవం చాటుకున్నా రు. ఈ సందర్భంగా పాఠశాలలో సుదర్శన్‌ను ఎంపీపీ మచ్చ అనసూర్య, స ర్పంచ్‌ చాడా తిరుపతిరెడ్డి శాలువాతో సన్మానించి మెమోంటో అందించారు. సుదర్శన్‌కు  ఉత్తమ ఉపాధ్యా అవార్డు రావడంపై మండల ప్రజల తరుపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజేందర్‌రెడ్డి, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధాన ఉపాధ్యాయుడు నామాని సాంబయ్య, చర్లపల్లి స్కూల్‌ హెచ్‌ఎం ప్రకా్‌షరావు, ప్రభాకర్‌రెడ్డి, నందిపాటి సంఽధ్య, తాళ్లపెళ్లి మంజూల, శీలం సరిత, బాబురావు, అమ్మ హారిక, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more