రామప్పను సందర్శించిన బీసీ కమిషన్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-10-13T04:47:03+05:30 IST

రామప్పను సందర్శించిన బీసీ కమిషన్‌ చైర్మన్‌

రామప్పను సందర్శించిన బీసీ కమిషన్‌ చైర్మన్‌

వెంకటాపూర్‌(రామప్ప),అక్టోబరు 12: ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు బుధవారం సందర్శించారు. బీసీ కమిషన్‌ కార్యదర్శి బుర్ర వెంకటేశంతో కలిసి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజారులు ఆయన్ను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం శిల్ప కళాసంపదను తిలకించిన చైర్మన్‌ మంత్రముగ్ధులయ్యారు. చుట్టూ గుట్టలు, విశాల సరస్సు, పచ్చని పర్యావరణం నడుమ ఆలయంలోని శిల్పాలు నాట్యమాడుతున్నట్టు ఉన్నాయని అభివర్ణించారు. సప్త స్వరాలు పలికే శిల్పాలు మనసునెంతో హత్తుకున్నాయని అన్నారు.  


Read more