ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-28T08:12:59+05:30 IST

తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లకు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు బుద్ధొచ్చిందని, సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నందువల్లే.

ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు

  • మొదటిసారి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు
  • ఇండియా గేట్‌ వద్ద కోలాహలం
  • మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి
  • ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు కేసీఆర్‌ ఘనతే: కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లకు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు బుద్ధొచ్చిందని, సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నందువల్లే.. భయంతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతోపాటు మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఇతర ప్రజాప్రతినిధులు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ వల్లనే తెలంగాణ సంస్కృతి, యాస, భాషకు గౌరవం దక్కిందన్నారు. కేసీఆర్‌ దేశ రాజకీయాల వైపు చూస్తుంటే బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-09-28T08:12:59+05:30 IST